SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ ఉదయం ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, గాలిలో తేమ శాతం 95% వరకు నమోదైంది. పొగమంచు తీవ్రత కారణంగా వాహనదారులు హెడ్లైట్లు ఉపయోగించి జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించారు. ఉదయం వేళల్లో అవసరం లేని ప్రయాణాలు చేయకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.