GNTR: ‘మొంథా’ తుఫాను కారణంగా రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కొల్లిపర తహశీల్దార్ సిద్ధార్థ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు.ప్రజలు ఎవరూ బయటకు వెళ్లవద్దని, ముఖ్యంగా చేపల వేట లేదా నది స్నానాలకు వెళ్లడం నిషేధం అని తహశీల్దార్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను ఇంట్లోనే ఉంచుకోవాలని సూచించారు.