NLG: ఈ సంవత్సరం పత్తి రైతులకు కాలం కలిసి రాలేదు. పూత కాత దశలోనే వర్షాలతో పత్తి చేలు ఎర్రబారి, ఊడలు రాలడంతో దిగుబడి తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మొదటి దశలో కొద్దిపాటి మేర పత్తి చేతికి అందినా సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో దళారులకు విక్రయించి నష్ట పోతున్నారు.