VZM: రాజాం మున్సిపాలిటీ ప్రజల భద్రత కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ (24X7) ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మొంథా తుఫాన్ ప్రభావంతో 26 నుంచి 30వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల కారణంగా చెట్లు పడిపోతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు 9121768292 సమాచారం ఇవ్వాలని కోరారు.