ప్రకాశం: ఒంగోలు మార్కెట్ యార్డ్ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని ఏఎంసీ ఛైర్మన్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఏఎంసీ ఛైర్మన్లు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం మార్కెట్ కమిటీలకు సంబంధించి పలు అభివృద్ధి విషయాలపై చర్చించి, మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటారు.