ప్రకాశం: మొంథా తుఫాన్ నేపథ్యంలో మండల స్థాయి అధికారులతో కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అబ్దుల్ ఖాదర్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తుఫాన్ బలపడే అవకాశం ఉన్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో సూచించారు. అనంతరం భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున, వాగుల వద్దకు ఎవరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.