SKLM: మొంథా తుఫాన్ నేపథ్యంలో సంతబొమ్మాళి మండలంలో హై అలర్ట్ గ్రామాలను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయా గ్రామాలలో తహసీల్దార్ హేమ సుందర్, ఎంపీడీవో జయంతి ప్రసాద్, పంచాయతీరాజ్ జేఈ, అంజిత్ కుమార్ పర్యటించారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న హనుమంతునాయుడుపేట, లింగుడు, మర్రిపాడు, ఉమ్మలాడ, భావనపాడు మేఘవరం గ్రామాలను తుఫాను ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు.