TG: జూబ్లీహిల్స్‌లో పోలీసులు అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో 170 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన శ్రీశైలం యాదవ్, ఆయన సోదరుడు రమేశ్ యాదవ్‌ను కూడా బైండోవర్ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.