AKP: అచ్యుతాపురం -అనకాపల్లి రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు హైకోర్టు ఆదేశాల మేరకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కే.లోకనాథ్ డిమాండ్ చేశారు. సోమవారం మునగపాకలో నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. టీడీఆర్ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నారు. నిర్వాసితులకు నగదు చెల్లించాలని తెలిపారు.