KNR: కరీంనగర్లో మొదటిసారిగా ఏ-డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్ జరగనుంది. అలుగునూరులోని వెల్చల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ చారిత్రాత్మక పోటీలు జరగనున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో హైదరాబాద్ వెలుపల అధికారిక ఏ-లెవల్ లీగ్ మ్యాచ్లకు ఆతిథ్య మిచ్చే తొలి జిల్లాగా కరీంనగర్ నిలిచింది.