అన్నమయ్య: ప్రమాదంలో కాలు పోగొట్టుకొని కుటుంబ జీవనం కోసం నానా ఇబ్బందులు పడుతున్న వికలాంగుడి పట్ల కనికరం చూపించాలని వైసీపీ ఇంచార్జి నిస్సార్ అహ్మద్ కోరారు. ఇందులో భాగంగా ఇవాళ బాధితుడితో కలిసి మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణికి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరి చేయాలని డిమాండ్ చేశారు.