SKLM: తుఫాన్ నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. వాతావరణం శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసినందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంగళవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంటనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.