PDPL: రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సోమవారం గోదావరిఖనిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక విద్యార్థుల సౌకర్యార్థం ఆధునిక సదుపాయాలతో కూడిన కళాశాలను త్వరితగతిన నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగరేణి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు