E.G: రాజానగరం మండలం పాత నామవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నక్క గజరాజు తన అనుచరులతో కలిసి సోమవారం YCP నుంచి జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఆయనకు రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం పాలన, ఎమ్మెల్యే బత్తుల చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేనలోకి చేరినట్లు వారు చెప్పారు.