E.G: నిడదవోలు మండలం కంసాలపాలెం వద్ద గల ఎర్ర కాలువను తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ కన్నబాబు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాలువలు పొంగే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అన్నివేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీవో సుస్మిత రాణి పాల్గొన్నారు.