WGL: అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి కొండా సురేఖ అన్నారు. GWMC 22వ డివిజన్ పరిధిలోని ఆటోనగర్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ, డ్రైనేజీ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. పనులు వేగంగా, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు.