SKLM: జిల్లా రైల్వే ప్రజలకు రైల్వే శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా తుఫాను ప్రభావంతో అప్రమత్తమైన రైల్వే శాఖ జిల్లా మీదుగా నడిచే దాదాపు 20కి పైగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ పోస్టు రైల్వే జీఎం పరమేశ్వర సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు ఈ రద్దు ఈనెల 27, 28, 29 తేదీలలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.