ASR: పీఎం జన్ మన్ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం పెంచిన రూ.1లక్షను వెంటనే లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలని గిరిజన సంఘం అరకు మండల అధ్యక్షుడు చిన్నబాబు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం సుంకరమెట్ట గ్రామ సచివాలయం ఎదుట పలువురు ఇళ్ల లబ్దిదారులతో నిరసన తెలిపారు. సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. పెంచిన సొమ్మును జమ చేయకపోతే ఇళ్ల నిర్మాణం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు.