మొంథా తుఫాన్ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. విజయవాడ డివిజన్ అధికారులతో సమావేశమైన ద.మ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ.. తుఫాన్ దృష్ట్యా ప్రయాణికుల భద్రత, రైళ్ల రాకపోకల విషయంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.