ADB: ఆదిలాబాద్ ఉపాధి కల్పన కార్యాలయంలో నిర్వహించిన ఉద్యోగ మేళాకు నిరుద్యోగుల నుంచి మంచి స్పందన లభించింది. వివిధ ప్రాంతాల అభ్యర్థులు ధ్రువపత్రాలతో పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు ఎంపిక విధానం, ఉద్యోగం గురించి వివరించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రైవేట్ రంగంలో ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి కల్పన అధికారి మిల్కా సూచించారు.