KMR: జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి పట్టణానికి కూతవేటు దూరంలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఏడాది నుంచి భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన మద్దికుంట గ్రామానికి చెందిన రేకులపల్లి జీవన్ రెడ్డి(37) సోమవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో శరీరం పూర్తీగా కాలిపోయి ప్రాణాలు విడిచాడు.