ELR: ‘మొంథా’ తుపాన్ నేపథ్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సూచించారు. ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, అందరూ సమన్వయంతో విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైన అన్ని ఖర్చులు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.