MBNR: మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో 2025–27 మద్యం పాలసీకి సంబంధించిన A4 మద్యం షాపుల లైసెన్స్ దారుల ఎంపిక సోమవారం లాటరీ పద్ధతిలో జరగనుంది. మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్‌లోని ప్రజావాణి హాల్లో ఈ డ్రా నిర్వహించనున్నట్లు నారాయణపేట ఎక్సైజ్ అధికారి అనంతయ్య తెలిపారు. మొత్తం 90 మద్యం షాపుల కోసం మొత్తం 2,487 దరఖాస్తులు వచ్చాయన్నారు.