VSP: పీఎంపాలెం పోలీసులు కొమ్మాది శివార్లలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని ఆదివారం అరెస్టు చేశారు. వారి నుంచి 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజాన శ్రావణ్ కుమార్ (నర్సీపట్నం వాసి) డిప్లమా పూర్తి చేశాడు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి మరో యువకుడి (జువెనైల్)తో కలిసి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.