GNTR: ‘మొంథా’ తుఫాను కారణంగా వేగవంతమైన గాలులు, భారీ వర్షాలు ఉంటాయని దుగ్గిరాల విద్యుత్ శాఖ ఏఈ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. కరెంట్ అంతరాయం లేదా ప్రమాదం జరిగితే వెంటనే 1912కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.