HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన గేటు వద్ద ఒక ఏసీపీ, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఐదుగురు ఎస్సైలు, 8 మంది ఏఎస్ఐలు, 41 మంది కానిస్టేబుళ్లు ఉండనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఒక ప్లాటూన్ సాయుధ బలగాలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండనున్నాయి.