VZM: మొంథా తుఫాన్ తీవ్రరూపం దాల్చి ఏపి తీర ప్రాంతంపై విరుచుకుపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని విజయనగరం, మన్యం జిల్లాల కలెక్టర్లలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిందని ఆయన తెలిపారు.