సత్యసాయి: సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తి గోకులంలో ‘సత్యసాయి వంద భజనాలు’ కార్యక్రమం భక్తి పారవశ్యంతో జరిగింది. భక్తులు, సాయి సంఘ సభ్యులు, విద్యార్థులు కలిసి భక్తి గీతాలు ఆలపించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సాయిబాబా సూత్రాలను గుర్తుచేసుకుంటూ, ఆయన ఆధ్యాత్మిక సేవా సందేశాన్ని పునరుద్ఘాటించారు. గోకులం పరిసరాలు భజనలతో మార్మోగాయి.