కోనసీమ: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని ప్రసిద్ధ శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయ ప్రాంతం మారుమోగింది. మహిళలు స్వామివారి సన్నిధిలో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.