AP: విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ఉద్యోగులకు 27 నుంచి 29 తేదీల్లో సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడితే ప్రజలు 1912 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు.