HYD: చాదర్ ఘాట్‌లోని విక్టోరియా ప్లే గ్రౌండ్లో కాల్పులు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే సెల్ ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అన్సారీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరో నిందితుడు అలీని పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.