సత్యసాయి: పరిగి మండలం వైసీపీ సర్పంచ్ లక్ష్మీ దేవమ్మతో పాటు మరో 30 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. ఆదివారం పెనుకొండలో టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత సమక్షంలో వారందరూ టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా మంత్రి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలోకి చేరినట్లు వారు పేర్కొన్నారు.