NLR: లింగసముద్రం మండలం రాళ్లపాడు జలాశయాన్ని ఆదివారం సాయంత్రం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. జలాశయం ప్రస్తుత నీటిమట్టం, అవుట్ ఫ్లో గురించి రాళ్లపాడు ప్రాజెక్ట్ డీఈతో ఆమె మాట్లాడారు. అలాగే, పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ వెంట కందుకూరు డీవైఎస్పీ బాలసుబ్రమణ్యం తదితర అధికారులు ఉన్నారు.