CTR: చిత్తూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆదేశాల మేరకు.. వర్షాల నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా విధులు నిర్వహించడానికి వీలుగా నగరపాలక పరిధిలో విధులు నిర్వహిస్తున్న సుమారు 500 పారిశుద్ధ్య కార్మికులకు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సభ్యులకు పంపిణీ చేశారు.