WGL: కాకతీయ మెడికల్ కాలేజీ వారోత్సవ వేడుకల భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన 2K రన్ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా సంధ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. శారీరక వ్యాయామం, క్రీడలతోపాటు విద్యార్థులు సమతుల్య జీవనశైలిని అలవరచుకోవాలన్నారు.