తేనె, దాల్చిన చెక్క మిశ్రమాన్ని రోజూ తింటే రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు. దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, గొంతు సమస్యలు ఉన్నవారికి ఈ మిశ్రమం మేలు చేస్తుంది. తేనె, దాల్చిన చెక్క మిశ్రమం గాయాలు, పుండ్లను మాన్పడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మొటిమలు తగ్గిపోతాయి. పలు రకాల చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.