KDP: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలకు జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని జిల్లా SP నచికేత్ ఆదివారం తెలిపారు. జిల్లా కేంద్రంలో మూడు రెస్క్యూ టీంలతో పాటు ప్రతి పోలీస్ సబ్ డివిజన్‌కు ఒక టీం సిద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకలు దాటరాదని, ఎలాంటి సహాయక చర్యలు అవసరమైన వెంటనే 112కు ఫోన్ చేసి తెలపాలన్నారు.