GNTR: తుపాను హెచ్చరికలతో కొల్లిపర మండల తహశీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్ జి. సిద్ధార్థ తెలిపారు. కొల్లిపర మండల గ్రామాల్లో ఉన్న ప్రజలు ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే తహశీల్దార్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. భారీ వర్షం వలన ఆస్తి, పశు, ప్రాణ నష్టం సంభవిస్తే కంట్రోల్ రూమ్ 9908568006, 9949098512 నంబర్లకు కాల్ చేయాలని కోరారు.