ELR: ‘మొంథా’ తుపాను కారణంగా వేలేరుపాడు మండలం రుద్రమకోట – అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం మధ్య తిరిగే ఫెర్రీ బోటు సర్వీసును 3 రోజులు నిలిపివేస్తున్నట్లు వేలేరుపాడు SI నవీన్ కుమార్ తెలిపారు. బలమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఈనెల 27, 28, 29న బోటు ప్రయాణం నిలిపివేస్తున్నామన్నారు. వేలేరుపాడు, కూనవరం మండలాల ప్రజలు సహకరించాలన్నారు