తిరుపతి: మొంథా తుపాన్‌ను ఎదుర్కునేందుకు చిత్తూరు, తిరుపతి జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాకు రూ.కోటి, చిత్తూరు జిల్లాకు రూ.50 లక్షల నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.