BDK: మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట మంగళవారం ప్రకటించారు. ప్రజలు స్థానిక అధికారులకు సహకరించి, భద్రతా చర్యలు పాటించాలని కోరారు. నేటి నుంచి 30 వరకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, తుఫాను నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.