SKLM: టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం వద్ద స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ వైద్యులు గాయత్రి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను సరఫరా చేస్తారు. కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తులు తాకిడి అధికంగా ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.