SRCL: మద్యం దుకాణాల టెండర్ లక్కీ డ్రా పారదర్శకంగా నిర్వహించామని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. జిల్లాలో 2025-2027 సంవత్సరం వరకు కొనసాగనున్న మద్యం షాపుల టెండర్ల ఓపెన్ డ్రా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు.