W.G: అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా తాడేపల్లిగూడెంకు చెందిన వబిలిశెట్టి నటరాజ్ నియమితులయ్యారు. ఫెడరేషన్ సలహా బోర్డు ఛైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు నటరాజ్ ఆదివారం తెలిపారు. ఉపాధ్యక్షుడిగా మారం వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా నటరాజ్‌ను నియమించారు.