చెన్నైలోని కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను టీవీకే పార్టీ అధినేత, సినీనటుడు దళపతి విజయ్ కలిశారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వారిని పరామర్శించారు. సెప్టెంబర్ 27న విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు.