SRD: ఆందోలు-జోగిపేట మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల నిధులు విడుదలయ్యాయని మున్సిపల్ కమిషనర్ రవీందర్ సోమవారం తెలిపారు. ఈ నిధులతో మున్సిపాలిటీలో రోడ్లు, మురుగు కాలువలు, వెల్కమ్ బోర్డులు, పార్కుల అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు. ఈ ప్రకటనతో స్థానిక ప్రజల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి.