KMM: స్థానిక చేతి వృత్తిదారులను ఆదుకోవడం ద్వారా స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని బీజేపీ జాతీయ నాయకులు,మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం మేదరబజార్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. చేతివృత్తిదారులు తయారు చేస్తున్న వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. స్థానిక కళాకారులు తయారు చేసిన వెదురు బుట్టలు, అలంకార వస్తువులను కొనుగోలు చేశారు.