VZM: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్బంగా కొత్తవలస సీతంపేటలో ఉన్న శివాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మొదటి సోమవారం కావడంతో శివాలయాన్ని ప్రత్యేక అలంకరణ చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాతావరణ శాఖ మొంథా తుఫాన్ హెచ్చరికలు చేసినా భక్తులు వేకువజామునే దర్శనం కోసం బారులు తీరారు. దర్శనం కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.