BDK: చండ్రుగొండ మండలం,తిప్పనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మహమ్మద్ నగర్ బీటీ రోడ్డుకు మరమ్మతు చేసేది ఎప్పుడని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.