MDK: మెదక్ మండలం శివ్వాయిపల్లి గ్రామానికి కర్నూలు జిల్లాలో ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదంలో మరణించిన మంగ సంధ్యారాణి, కూతురు చందన మృతదేహాలు చేరుకున్నాయి. శివ్వాయిపల్లికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చేరుకొని సంధ్యారాణి, చందన మృత దేహాలకు పూలమాలలు వేసే నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.